top of page

Need For Volunteer's

17 Apr 2025

రైతు రక్షణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి

వార్త



రైతు రక్షణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి

- రైతుల ముఖాల్లో ఆనందం చూద్దాం

ZANSHANA

- రైతుల పంటలకు కనీస మద్దతు ధర అందిద్దాం

- సిద్ధాంతకర్త బాకీ బైరెడ్డి, చైర్మన్ రాచకొండ మల్లేష్

కామేపల్లి, ఏప్రిల్ 16 ప్రభాతవార్త :

రైతు రక్షణ కార్యక్రమం లో భాగస్వాములు కావాలని రైతు రక్షణ సిద్ధాంత కర్త బాకీ బైరెడ్డి, హైదరాబాద్ జనని ఫౌండేషన్ చైర్మన్ రాచకొండ మల్లేష్, చార్డు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సామల బా బు పిలుపునిచ్చారు. కామేపల్లి రైతు వేదికలో చార్డు స్వ చ్చంద సేవా సంస్థ ఆధ్వర్యం లో బుధవారం రైతు రక్షణ కార్యక్రమంలో భాగస్వామ్యంపై నిర్వహించిన ప్రత్యేక అవగా హన కార్యక్రమంలో వారు ము ఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర అందిద్దాం | తద్వా రా రైతుల ముఖాల్లో ఆనందం చూద్దామన్నారు. ఎస్ హెచ్ జి సభ్యులు, రైతులు, రైతు కూలీ లు, రైతు రక్షణ కార్యక్రమంలో విరివిగా సభ్యులుగా నమోదు కావాలని కోరారు. రైతులకు భరోసా కల్పిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల ఉద్ధరణకు అంకిత మై ఉపాధి అవకాశాలు కల్పిం చడమే ధ్యేయంగా రైతు రక్షణ ఆసరా స్టోర్ కార్యక్రమాలకు శ్రీ కారం చుట్టడం జరిగిందన్నారు. ఎస్ |హెచ్ జి సభ్యులకు స్టార్ట్ ప్ కంపెనీలు రైతుల ఉత్పత్తి చేసిన నిత్యవసర వినియోగ ఉత్పాదకాలు, వ స్తువులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ అభివృద్ధి సాధించ డం, యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించ డం జరుగుతుందన్నారు. సభ్యులైన వారికి వ్యవసాయ ఉత్పత్తులకు,

నిత్యవసర స రుకులు, సేవలందించడం జరుగుతుందన్నారు. పారదర్శ కతతో కూడిన క్రయవిక్రయాలు చెల్లింపులు ఆర్థిక కార్యక్రమా లు బాధ్యతాయుతంగా నిర్వ హించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పనిచే యుటకు గ్రామస్థాయిలో కమ్యూనిటీ మిత్ర, విలేజ్ ఆర్గనైజర్, ప్రోగ్రాం కో ఆర్డినేట ర్, ప్రోగ్రాం మేనేజర్ లకు అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. పని ఆధారంగా వారికి రెమ్యూన రేషన్ చెల్లించడం జరుగుతుం దన్నారు. సభ్యులుగా చేరుట కు 18 నుండి 54 సంవత్సరా లలోపు వయసు గల స్త్రీ, వు రుషులు అర్హులు అన్నారు. రూ.300 చెల్లించి సభ్యులుగా చేరవచ్చు అని కోరారు. సభ్యు లకు సంవత్సర కాలానికి గాను రూ. 2 లక్షల విలువ కలిగిన ప్రమాద బీమా పాలసీ ఉంటుం దన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ బి.శ్రీ కన్య, చార్డు సంస్థ ఉపాధ్యక్షులు గుడిచుట్టూ రామనాథం, విలేజ్ కోఆర్డినేటర్ జర్పల రవీందర్, యం. ఉష, ఎం.రవి, రైతులు, కమ్యూనిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

bottom of page